రైల్వే  స్టేషన్ లో పర్మిషన్ లేకుండా వ్యాపారాలు

రైల్వే  స్టేషన్ లో పర్మిషన్ లేకుండా వ్యాపారాలు

సికింద్రాబాద్​, వెలుగు: సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పర్మిషన్ లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారిపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని 6 డివిజన్లలో గురువారం తనిఖీలు చేపట్టిన అధికారులు పర్మిషన్ లేకుండా వ్యాపారాలు చేస్తున్న 492 మందిని గుర్తించి వారికి రూ.4 లక్షల 78 వేల 640 ఫైన్ విధించారు.  సికింద్రాబాద్ ​డివిజన్​లో 108 మంది పట్టుబడగా, రూ.74,100 ఫైన్ విధించారు. విజయవాడ డివిజన్​లో 129 మంది పట్టుకొని రూ. 2,06,650 లు, గుంతకల్​డివిజన్​లో 163 మంది పట్టుబడగా, రూ. 1,31,210 జరిమానా వసూలు చేశారు.  హైదరాబాద్​డివిజన్​లో 38 మందిని పట్టుకుని రూ.36,280, గుంటూరు డివిజన్​లో 44 మంది నుంచి రూ. 22,900, నాందేడ్​డివిజన్​లో 10 మందికి రూ.7,500 జరిమానా విధించారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో పర్మిషన్ లేకుండా అమ్మకాలు జరిపే వ్యాపారస్తులను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్​గజానన్​మాల్యా చెప్పారు.