
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో చేసిన పనులకు సంబంధించి పెండింగ్లోని బిల్లులను సర్పంచులకు వెంటనే చెల్లించాలనీ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్కు లెటర్ రాశారు. ఒక్కో పంచాయతీకి సుమారు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించాలని కూనంనేని ఆర్టీసీ, సింగరేణి కాలరీస్ లో వెంటనే కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని తాజాగా కోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు.