- ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆవేదన
బషీర్‌బాగ్, వెలుగు: బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల ఉన్నత విద్య దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన బీసీ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం రూ.8 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో విద్యార్థులకు హాల్‌టికెట్లు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని.. ప్రైవేట్ కాలేజీలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వాపోయారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పథకాన్ని బలహీనపరుస్తోందని విమర్శించారు. డిమాండ్ల సాధనకు ఏప్రిల్ 3న కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
