టీకా ఎక్కడేస్తున్నరో తెలియక జనం అయోమయం

టీకా ఎక్కడేస్తున్నరో తెలియక జనం అయోమయం
  • గ్రేటర్​లో వ్యాక్సిన్​ సెంటర్లు ఎక్కడున్నయో తెలియట్లేదు 
  • వేసుకునేందుకు వెళ్లి వెనుదిరిగిపోతున్న జనాలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో సెకండ్​ డోస్​ వ్యాక్సినేషన్​ ​డ్రైవ్​ రెండురోజులుగా కొనసాగుతోంది. మొత్తం150 సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే వ్యాక్సిన్​ఎక్కడ వేస్తున్నారనేది జనానికి తెలియడంలేదు. ప్రతి రోజు వ్యాక్సినేషన్​ సెంటర్లు ఓపెన్​ఉంటాయని ఉన్నతాధికారులు చెప్పగా ఆదివారం కొన్నిచోట్ల అందుబాటులో ఉండగా మరికొన్నిచోట్ల కనిపించలేదు. సండే కావడంతో సికింద్రాబాద్, నాగోల్, మాదాపూర్​ ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్, ప్రైవేట్​ఎంప్లాయీస్​ వచ్చినప్పటికీ సెంటర్లు ఎక్కడున్నాయో తెలియక వెనుదిరిగి వెళ్లిపోయారు. కొందరు బల్దియా హెల్ప్​ లైన్​నంబర్​ 040–21111111కు కాల్​ చేస్తే సండే హాలీడే ఉందని సమాధానం ఇచ్చారు. ఫస్ట్​డోస్​మాదిరిగా ఒక చోట సెంటర్​ని ఏర్పాటు చేస్తే వ్యాక్సిన్​ తీసుకునేందుకు వీలుగా ఉంటుంది.  లేదంటే సెంటర్​ ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా హైల్ప్ లైన్ నంబర్​ను ఏర్పాటు చేయాలని జనం పేర్కొన్నారు.