డిజిటల్ వాలెట్లు, క్యూఆర్ కోడ్ల వైపు మొగ్గు

డిజిటల్ వాలెట్లు, క్యూఆర్ కోడ్ల వైపు మొగ్గు
  • ఆసియా‑పసిఫిక్ రీజియన్‌‌‌‌లో ఇండియాలోనే ఎక్కువ
  • అతిపెద్ద పేమెంట్ విధానంగా కొనసాగుతున్న క్యాష్  
  • మాస్టర్‌‌‌‌‌‌‌‌కార్డ్ సర్వే వెల్లడి

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: దేశంలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరుగుతున్నాయని, ఆసియా–పసిఫిక్ రీజియన్‌‌‌‌లో  ఇండియాలోనే డిజిటల్ పేమెంట్స్ వాడకం వేగంగా పెరుగుతోందని మాస్టర్‌‌‌‌‌‌‌‌ కార్డు చేసిన  సర్వే ఒకటి వెల్లడించింది.  కనీసం 93 శాతం మంది ప్రజలు ఒక్కసారి అయినా డిజిటల్ పేమెంట్స్‌‌‌‌ చేశారని తెలిపింది.  98 శాతంతో చైనా మనకంటే ముందు ఉంది. కాగా,  క్రెడిట్‌‌‌‌, డెబిట్ కార్డులు, క్యూఆర్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌, డిజిటల్ వాలెట్లు వంటి విధానాల ద్వారా చేసే పేమెంట్లు డిజిటల్  పేమెంట్స్ కిందకు వస్తాయి. ఈ సర్వే కోసం ఏడు ఆసియా–పసిఫిక్ దేశాల్లోని  7,004 మంది పెద్దవారి  నుంచి అభిప్రాయాలను మాస్టర్‌‌‌‌‌‌‌‌కార్డ్ సేకరించింది. ఈ సర్వే ప్రకారం, దేశంలో డిజిటల్ వాలెట్ల వాడకానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 58 శాతం మంది రెస్పాండెంట్లు గత ఏడాది కాలంలో ఒక్కసారి అయినా డిజిటల్ వాలెట్‌‌‌‌ను వాడామని వివరించారు. యువత ఈ విధానంలో పేమెంట్స్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటు క్యూఆర్‌‌‌‌‌‌‌‌ కోడ్ల ద్వారా చేసే పేమెంట్లు, మనీ ట్రాన్స్‌‌‌‌ఫర్ యాప్స్ ద్వారా చేసే పేమెంట్లు కూడా ఇండియాలో పెరుగుతున్నాయని మాస్టర్‌‌‌‌‌‌‌‌కార్డ్‌‌‌‌ సర్వే వెల్లడించింది. క్యాష్‌‌‌‌తో పేమెంట్లు చేయడం వీటి తర్వాత స్థానాల్లో ఉంది.  క్రెడిట్‌‌‌‌, డెబిట్ కార్డులు లేదా ప్రీపెయిడ్ కార్డులు లేదా కాంటాక్ట్‌‌‌‌లెస్‌‌‌‌ కార్డులతో చేసే పేమెంట్లకు ప్రజలు తక్కువ ఆసక్తి చూపిస్తున్నారని సర్వే వివరించింది. 

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ కొనుగోళ్లు పైకి..

ఈ సర్వేలో 52 శాతం మంది రెస్పాండెంట్లు మగవారు కాగా, 48 శాతం మంది మహిళలు ఉన్నారు. ఏజ్‌‌‌‌ గ్రూప్ చూస్తే 18–25 ఏళ్ల మధ్య ఉన్నవారి వాటా 37 శాతంగా, 26–43 ఏజ్‌‌‌‌ మధ్య ఉన్నవారి వాటా 48 శాతంగా ఉంది. దేశంలోని కన్జూమర్లు వివిధ మార్గాల్లో కొనుగోలు జరుపుతున్నారని, ఇందులో  ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయని  ఈ సర్వే వెల్లడించింది. రెస్పాండెంట్లలో 48 శాతం మంది మొబైల్ యాప్‌‌‌‌ ద్వారా  గత సంవత్సర కాలంలో ఒక్క వస్తువైనా  కొనుగోలు చేశామని వివరించారు. ఇందుకోసం డిజిటల్ పేమెంట్ విధానాన్ని ఉపయోగించామని తెలిపారు. 55 శాతం మంది మర్చంట్లు నిర్ధేషించిన పేమెంట్ విధానాన్నే వాడామని, అంటే లాయల్టీ పాయింట్లు లేదా స్టోర్ క్రెడిట్స్‌‌‌‌ను ఉపయోగించామని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే సర్వేలో పాల్గొన్నవారిలో 91 శాతం మంది గత ఏడాది కాలంలో  ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఒక్క ప్రొడక్ట్‌‌‌‌ అయినా కొనుగోలు చేశామని చెప్పారు. 

సెక్యూరిటీకే ప్రాధాన్యం..

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ కొనుగోలు చేసేటప్పుడు వచ్చే రివార్డ్ పాయింట్లు, ఉచితాలపై కంటే సెక్యూరిటీకి కన్జూమర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సెక్యూరిటీ ఆధారంగా పేమెంట్ విధానాన్ని ఎంచుకుంటున్నామని 42 శాతం రెస్పాండెంట్లు వెల్లడించారు. 32 శాతం మంది రివార్డ్‌‌‌‌లకు, 25 శాతం మంది డిస్కౌంట్‌‌‌‌, ప్రమోషన్లకు ప్రాధాన్యం ఇచ్చారని మాస్టర్‌‌‌‌‌‌‌‌కార్డ్ సర్వే పేర్కొంది. 26–43 ఏళ్ల మధ్య ఉన్న కన్జూమర్లు ఎక్కువగా రివార్డ్ ఇచ్చే పేమెంట్ విధానాలను ఫాలో అవుతున్నారని తెలిపింది.  మొత్తంగా చూస్తే 39 శాతం మంది రెస్పాండెంట్లు వాడడానికి సులువుగా ఉండే పేమెంట్ విధానాలను ఎంచుకుంటున్నారు. ఇందులో  జనరేషన్ ఎక్స్‌‌‌‌ (ఏజ్‌‌‌‌ 44–57 ఏళ్లు మధ్య ఉన్నవారు) వాటానే 45 శాతంగా ఉంది. పేమెంట్ విధానాన్ని ఎంచుకునేటప్పుడు  తక్కువ వడ్డీ రేట్లు, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు లాంజ్‌‌‌‌కు యాక్సెస్‌‌‌‌ కలిపించడం వంటి రివార్డులకు కన్జూమర్లు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఈ సర్వే ద్వారా తెలిసింది. డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరుగుతున్నా  క్యాష్ పేమెంట్సే సెక్యూర్‌‌‌‌‌‌‌‌ అని భావించే వారు ఎక్కువగా ఉన్నారని ఈ సర్వే పేర్కొంది. మరోవైపు క్యూఆర్ కోడ్‌‌‌‌లతో పేమెంట్‌‌‌‌ చేయడం  కూడా క్యాష్‌‌‌‌ మాదిరే సెక్యూర్ అని ఎక్కువ మంది రెస్పాండెంట్లు భావిస్తున్నారని వివరించింది.