ఎలాంటి ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయిస్తారు: మోడీ

ఎలాంటి ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయిస్తారు: మోడీ

నిజాయితీ కలిగిన ప్రభుత్వం కావాలా లేక అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం కావాల అనే అంశాన్ని ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఒడిశాలోని సుందర్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు. సుందర్‌గఢ్‌కు తొలిసారిగా ఒక ప్రధానమంత్రి వచ్చారని ఆయన చెప్పారు. తాము డబ్బుపై ఆధారపడి లేమని, తమది కార్యకర్తల పార్టీ అని చెప్పారు. కార్యకర్తలు పార్టీని ఏర్పాటు చేశారని, దానికోసం త్యాగాలు చేశారన్నారు. డబ్బు కారణంగా తయారైన పార్టీలు అనేకం ఉన్నాయని, తమది చెమటోడ్చి రూపొందించిన పార్టీ  బీజేపీ అన్నారు ప్రధాని మోడీ.