12వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవు

12వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవు

నిర్మల్ జిల్లా: రాష్ట్రంలో 12వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవని.. పరిస్థితి చూస్తుంటే తెలంగాన రాష్ట్రం కూడా మరో శ్రీలంక అవుతుందేమోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన పట్టణంలో బీఎస్పీ కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి.. ఇంద్ర నగర్ లో బీఎస్పీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.  బీఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
దళితులకు ఇవ్వాల్సిన అసైన్డ్ భూముల్లో టీఆర్ఎస్ ఆఫీసులు కట్టడం దారుణం 
ఈ సందర్భంగా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిర్మల్ మున్సిపాలిటీలో జరిగిన ఉద్యోగుల భర్తీలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సీబీ సీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇవ్వాల్సిన ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో టి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయాలు నిర్మించడం దారుణం అన్నారు. ఇతర రాష్ట్రాల్లో రైతులను ఆదుకునేందుకు వెళ్లిన సీఎం కేసీఆర్... తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 12 తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పునరుద్ఘాటించిన ఆయన తెలంగాణ మరో శ్రీలంక లాగా అవుతుందని ప్రజలు భయాందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.  ప్రగతి భవన్ ను బద్దలుకొట్టి బహుజన రాజ్యాధికారం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 

ఇవి కూడా చదవండి

ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రానికి వర్ష సూచన

తండ్రైన నటుడు సుధాకర్ కోమాకుల.. ఏ పేరు పెట్టారో తెలుసా

ఆ సినిమా చూస్తే కన్నీళ్లొస్తాయి