10 రూపాయలకే డ్రెస్ ఆఫర్.. భారీగా ట్రాఫిక్ జామ్

10 రూపాయలకే  డ్రెస్ ఆఫర్.. భారీగా ట్రాఫిక్ జామ్
  • ఆర్మూర్ లో షాపు ముందు బారులు తీరిన యువకులు, ప్రజలు
  • ట్రాఫిక్​ జామ్ తో వ్యాపారిపై కేసు నమోదు చేసిన పోలీసులు  

ఆర్మూర్, వెలుగు: ఓ వ్యాపారి రూ.10కే  డ్రెస్ ఇస్తామని సోషల్​ మీడియాలో పోస్ట్ చేసి విస్తృతంగా ప్రచారం చేశాడు.  ఆర్మూర్​ టౌన్​లోని అంబేద్కర్​ చౌరస్తా సమీపంలోని ఫంకీ బాయ్స్​ డ్రెస్సెస్​లో ఈ ప్రత్యేక ఆఫర్​ ఉన్నట్లు  పేర్కొన్నాడు.  గురువారం  ఉదయం 10  గంటల నుంచి11 గంటల వరకే  ఆఫర్ ఉందని తెలిపాడు. దీంతో  ఆర్మూర్​ తో పాటు పరిసర గ్రామాల నుంచి  భారీగా యువకులు, ప్రజలు షాప్ వద్దకు తరలివెళ్లారు. 

 వచ్చినవారిని చూసి వ్యాపారి షాప్ మూసేశాడు.దీంతో  వచ్చినవారు గొడవకు దిగడంతో  ట్రాఫిక్ జామ్ అయింది.  సమాచారం అందడంతో  పోలీసులు వెళ్లి  వచ్చినవారిని  చెదరగొట్టి షాపు ఓనర్ ను  అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పర్మిషన్​ లేకుండా న్యూసెన్స్ క్రియేట్​ చేసి ట్రాఫిక్​ కు ఇబ్బంది కలిగించినందుకు   షాప్ ఓనర్ పై  కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.