
తెలంగాణలో పండుగ వచ్చిందంటే చాలు మందు,మాంసం ఖచ్చితంగా ఉండాల్సిందే..లేకపోతే ముక్క లేకుంటే చాలా మందికి ముద్ద దిగదు.దసరా పండుగ తెలంగాణలో అతిపెద్ద పండుగ ఏ రేంజ్ లో జరుగుతుందో అందరికీ తెలుసు.. దసరా రోజు మందు,మాంసం విక్రయాలు జోరుగా సాగుతాయి. పట్టణాలు,గ్రామాల్లోనూ అనే తేడా లేకుండా యాటలు తెగుతయ్. అయితే ఈ సారి దసరా అక్టోబర్ 2న అంటే గాంధీ జయంతి రోజున వస్తుండటంతో మటన్,మందు,చికెన్ షాపుల క్లోజ్ చేయనున్నారు.
దీంతో చాలా ప్రాంతాల్లో ఒక్కరోజు ముందుగానే దసరా సందడి మొదలైంది. కొందరు ఈ రోజే దసరా పండుగ చేసుకుంటుండగా..మరికొందరు రేపటి కోసం మందు, మటన్,చికెన్ తీసుకుని పెట్టుకుంటున్నారు. దీంతో మటన్, చికెన్ కొనుగోలు చేసేందుకు షాపులు ముందు బారులు తీరారు జనం. కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఉదయం నుంచే క్యూ కట్టారు. ఇవాళే దసరా చేసుకుంటున్నామని చెప్తున్నారు స్థానికులు
రికార్డ్ స్థాయిలో లిక్కర్ సేల్స్
మరో వైపు మందు ప్రియులు కూడా ముందు జాగ్రత్తగా కొనుగోలు చేస్తున్నారు. సెప్టెంబర్ 29న ఒక్క రోజులోనే రూ. 278 కోట్ల 66 లక్షల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం (సెప్టెంబర్ 30) కూడా రూ.300 కోట్లపైన మద్యం సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక గురువారం కూడా రూ.300 కోట్ల పైన మద్యం లిప్ట్ చేసే అవకాశం ఉంది. మూడో తేదీన కూడా సేల్స్ ఉంటాయని, వరుసగా సెలవులు ఉండటం, స్థానిక ఎన్నికల నగారా మోగడంతో గ్రామాల్లో దవాత్ లు భారీగా చేసుకుంటారని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.