పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ మౌనం కారణంగా స్థానిక రైతులు స్వయంగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. పోతిరెడ్డిపాడు పై సుప్రీం కోర్టులో తేల్చుకుంటాం అన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంటే కేసీఆర్ కావాలనే మౌనం వహించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. నీటిని ఏపీ వేగంగా తరలించుకుపోతుంటే ఇంకెంత కాలం సీఎం కేసీఆర్ మౌనంగా ఉంటారని ప్రశ్నించారు. సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను వెూసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడుపై తానే పోరాటం చేశానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఏపీ సీఎం జగన్‌కు….. సీఎం కేసీఆర్ ఏదైనా హావిూ ఇచ్చారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. పాలమూరు ప్రజలను ఇంకెంతకాలం వెూసం చేస్తారని ప్రశ్నించారు సంపత్ కుమార్.

