అమలు సాధ్యంకాని హామీలతో ప్రజలు మోసపోవద్దు : కవిత

అమలు సాధ్యంకాని హామీలతో ప్రజలు మోసపోవద్దు :  కవిత

నిజామాబాద్​, వెలుగు :  అమలు సాధ్యంకాని హామీలను  బాండ్​ పేపర్లపై రాసి కాంగ్రెస్​ లీడర్లు  కొత్త మోసానికి తెరలేపారని ఎమ్మెల్సీ కవిత  విమర్శించారు.  మంగళవారం  నిజామాబాద్​లో మీడియాతో మాట్లాడారు.  తెలంగాణలో  కేసీఆర్​ గవర్నమెంట్​ ఏర్పడ్డాక 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1.6 లక్షలు భర్తీ చేశామన్నారు.  కర్నాటక ఎలక్షన్​లో 223 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్​ అభ్యర్థులు బాండ్​ పేపర్లపై హామీలు రాసి ఓట్లు దండుకున్నారని  చెప్పారు. 

తెలంగాణలో కూడా కొందరు కాంగ్రెస్​ లీడర్లు కేవలం ఓట్ల కోసమే బాండ్​ పేపర్ల రాస్తున్నారని, వాటిని నమ్మి మోసపోవద్దన్నారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్​ కార్డులు జారీ చేస్తామని తెలిపారు.  మరోసారి కేసీఆర్​ గవర్నమెంట్​ వస్తేనే  ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో   అభ్యర్థి షకీల్​, రెడ్కో మాజీ చైర్మన్​ అలీముద్దీన్​ తదితరులు ఉన్నారు.