ఊళ్లలోనూ పెరుగుతున్న  బీపీ, షుగర్​ పేషెంట్లు

ఊళ్లలోనూ పెరుగుతున్న  బీపీ, షుగర్​ పేషెంట్లు
  • జిల్లాలో 85,197 మందికి బీపీ, 56,269 మందికి షుగర్
  •  రూరల్ ​ఏరియాల్లోనే ఎక్కువ మంది బాధితులు
  •   జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు

కామారెడ్డి, వెలుగు: మారిన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం లాంటి అనేక కారణాలతో బీపీ, షుగర్​వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కామారెడ్డి జిల్లాలోనూ ప్రతీ 100 మందిలో 18 మంది బీపీ, 12 మంది షుగర్ తో బాధపడుతున్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వే గణాంకాలు చెబుతున్నాయి. రూరల్​ ఏరియాల్లోనూ ఎక్కువ మంది ఈ వ్యాధుల బారినపడుతున్నట్లు డాక్టర్లు పేర్కొంటున్నారు. జిల్లాలో 9.72 లక్షల మంది జనాభా ఉండగా, ఇటీవల 4,63,546 మందికి టెస్టులు నిర్వహించారు. ఇందులో 85,197 మంది బీపీ, ​56,269 మందికి షుగర్​ఉన్నట్లు హెల్త్ డిపార్ట్​మెంట్ సిబ్బంది గుర్తించారు.


30 ఏళ్లు దాటిన వారి వివరాలు

జిల్లాలో ఇటీవల ఎన్​సీడీ సర్వేలో భాగంగా బీపీ, షుగర్​వ్యాధుల బారిన పడుతున్న వారి వివరాలు సేకరించారు. 30  ఏళ్లు దాటిన వారికి  టెస్టులు చేసి ఈ వివరాలు తీసుకున్నారు. స్థానిక ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సర్వే చేపట్టారు. జిల్లాలో 30 ఏళ్లు పైబడిన 4,63,546 మందికి టెస్టులు చేశారు. పీహెచ్​సీల వారీగా ఆయా వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారి వివరాలు సేకరించి ఆన్​లైన్​లో ఎంట్రీ చేశారు. శ్రమ ఎక్కువగా చేసే గ్రామీణుల్లోనూ ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.


పీహెచ్​సీల వారీగా ఇలా..

బీపీ, షుగర్​ఉన్న వారిలో ఎక్కువ మంది నిజాంసాగర్​ పీహెచ్​సీ పరిధిలో ఉన్నారు. ఈ ఏరియాలో  7,955 మందికి బీపీ, 4,761 షుగర్​ఉన్నట్లు గుర్తించారు. జుక్కల్ పీహెచ్​సీ పరిధిలో 6,734 మంది బీపీ, 3,716 మంది షుగర్, డోంగ్లీలో 5,426 మంది బీపీ, 3,588 షుగర్ బాధితులు ఉన్నారు. పెద్దకొడప్​గల్​లో బీపీ 4,947, షుగర్​3,925, అన్నారంలో 1,881బీపీ, 1,468 షుగర్​బాధితులను గుర్తించారు. భిక్కనూరులో 3,512 మందికి బీపీ, 2,061 మందికి షుగర్​ఉంది. బీబీపేటలో 5,070 బీపీ, 3607 మంది షుగర్​బాధితులు ఉన్నారు. బీర్కుర్​లో బీపీ 5,444, షుగర్​3,702, దేవునిపల్లిలో బీపీ 4,592, షుగర్​3,533, ఎర్రాపహాడ్​లో బీపీ 3,909, షుగర్​2,755, హన్మాజీపేటలో బీపీ 3,960, షుగర్​2,528, లింగంపేటలో బీపీ 5,126, షుగర్​3,148 ఉన్నారు. మాచారెడ్డిలో బీపీ 3,565, షుగర్​1,978, మత్తమాల్​లో బీపీ 3,515, షుగర్​2,597, నాగిరెడ్డిపేటలో బీపీ 3,013, షుగర్​2,425, రాజంపేటలో బీపీ 2,246, షుగర్​1,780, రాజీవ్​నగర్​లో బీపీ 2,175, షుగర్​1,429,  రామారెడ్డిలో బీపీ 2,479, షుగర్​1,521, సదాశివనగర్​లో బీపీ 2,635, షుగర్​1,529, ఉత్తునూర్​లో బీపీ 4,280, షుగర్​2,737  కామారెడ్డి అర్బన్​లో బీపీ 2,722 మంది, షుగర్​1,482 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇంకా  కొందరు టెస్టులు చేసుకోని వారు కూడా ఉన్నారు.

మారిన అలవాట్లతో వ్యాధులు

కాలానుగుణంగా ప్రజల ఆహార అలవాట్లలో అనేక మార్పుల వచ్చాయి. దీంతో ఎక్కువ మంది బీపీ, షుగర్​ లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. జిల్లాలో ఈ వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎన్​సీడీ సర్వే అందించిన వివరాల ఆధారంగా రోగులకు ప్రతీనెల మందులు అందిస్తున్నాం. జాగ్రత్తలు తీసుకుంటే ముప్పు నుంచి బయటపడొచ్చు.

- డాక్టర్​లక్ష్మణ్​సింగ్, డీఎంహెచ్​వో