సీఎం రేవంత్ నాయకత్వాన్ని స్వాగతించిన ప్రజలు : నీలం మధు

సీఎం రేవంత్ నాయకత్వాన్ని స్వాగతించిన ప్రజలు : నీలం మధు
  •     బీసీ బిడ్డ నవీన్ యాదవ్ ను గెలిపించారు
  •     కాంగ్రెస్​ నేత నీలం మధు 

పటాన్​చెరు, వెలుగు: ఇందిరమ్మ తరహాలో ప్రజా పాలన అందిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు స్వాగతించి జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీ తో కాంగ్రెస్ ను గెలిపించారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్​చార్జి నీలం మధు అన్నారు. 

శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందిన సందర్భంగా జుబ్లీహిల్స్ లోని సీఎం పార్టీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో మధు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చి బీసీ వాదాన్ని బలపర్చిన సీఎం రేవంత్ నమ్మకాన్ని ప్రజలు నిలబెట్టారని సంతోషం వ్యక్తంచేశారు. 

యావత్ బీసీ లోకమంతా కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇచ్చి గెలుపులో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. బీసీ బిడ్డ నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీ తో గెలిపించిన జూబ్లీహిల్స్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రులతో కలసి సంబరాలో పాల్గొన్నారు.