భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : ఆర్డీవో రమాదేవి

భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : ఆర్డీవో రమాదేవి

మెదక్​ టౌన్​, వెలుగు: భూభారతి చట్టంతో రైతుల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారమవుతాయని మెదక్ ఆర్డీవో రమాదేవి అన్నారు. బుధవారం మెదక్​ మండలం ముక్త భూపతిపూర్‌‌లో నిర్వహించిన  రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దరఖాస్తులు పూర్తి చేసేటప్పుడు తమ సమస్యలను వివరంగా తెలియజేయాలన్నారు. దరఖాస్తులు సమయంలో తగిన ఆధారాలు అధికారులకు అందించాలన్నారు. రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని, రైతుల సమస్యలను పూర్తి వివరాలతో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
 
బెజ్జంకి, వెలుగు:
భూభారతి చట్టంతో భూ సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయని తహసీల్దార్‌‌ చంద్రశేఖర్ అన్నారు. బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 

తూప్రాన్ డివిజన్ లో 3441 దరఖాస్తులు

తూప్రాన్, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో తూప్రాన్‌ డివిజన్‌ నుంచి 3,441 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీవో జయచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం తూప్రాన్ మండలం నాగులపల్లి, మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలతో మాట్లాడి దరఖాస్తులను పరిశీలించారు. ఇప్పటి వరకు 62 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తిచేశామన్నారు.