క్లాస్ రూంలో 50 శాతం మంది విద్యార్థులకే అనుమతి

క్లాస్ రూంలో 50 శాతం మంది విద్యార్థులకే అనుమతి

రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా  డిగ్రీ, పీజీ వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉన్నత విద్య శాఖాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ప్రతీ కాలేజీ తరగతుల వారిగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను తరుచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.

కాలేజీల్లో విద్యార్థులు గుంపులు గుంపులుగా ఒకే దగ్గర ఉండకుండా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత వారిదేనన్నారు.