పట్టుదలతో లాయరైంది

పట్టుదలతో లాయరైంది

కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన సారా ‘లా’ పట్టా అందుకుంది. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? చాలానే ఉంది. అదేంటంటే...సారా వాళ్ల అమ్మానాన్నల పేర్లు సన్నీ, బెట్టీ. వీళ్లకు ముగ్గురు పిల్లలు సారా, మరియా, అబ్బాయి ప్రతీక్​.  ఈ ముగ్గురికీ పుట్టుకతోనే వినికిడి శక్తి లేదు. సారా చిన్నప్పటి నుంచి  చదువులో ఎప్పుడూ ముందుండేది.  అందరినీ అనేక రకాల ప్రశ్నలు అడిగేది.  వినికిడి సమస్యతో  ముగ్గురు పిల్లలు ప్రపంచానికి దూరం అవుతారేమో అనుకునేవారు అమ్మా నాన్న. కానీ, అందరూ  బాగా చదువుకున్నారు. సారా చిన్నప్పట్నించీ పెయింటింగ్‌‌, క్రాఫ్ట్‌‌ వర్క్‌‌, బ్యాడ్మింటన్‌‌, డాన్స్​ నేర్చుకుంది.  స్కూల్​లో ఎప్పుడు ఫస్ట్​ వచ్చేది.  అలా స్కూల్​, కాలేజీ చదువుల్లో టాపర్​గా ఉంటూ..  లా సబ్జెక్ట్​పై ఇంట్రెస్ట్​ పెంచుకుంది.  దీంతో లా చదివి లాయర్​ కావాలని కలగన్నది.  అయితే వినికిడి సమస్యతో ఉన్న సారాకి లా కోర్సు చేయడం సవాలుగా మారింది. ‘ఈ సమస్యతో కోర్టులో ఎలా వాదిస్తావు?’ అనేవారు చాలామంది.  ఒకదశలో కాలేజీలో సీటు కూడా ఇవ్వలేదు.  ఆ తరువాత ‘సెయింట్‌‌ జోసెఫ్‌‌ లా కాలేజీ’లో సారాకు అడ్మిషను దొరికింది.  అలా జోసెఫ్​ కాలేజీలో లా చదివి.  ఇటీవల రిలీజ్​ అయిన లా ఫలితాల్లో మంచి రిజల్ట్​ సాధించింది. ఇన్​స్పైరింగ్​ స్టూడెంట్​గాపేరు తెచ్చుకుంది. లా పట్టా అందుకొని దేశ న్యాయ వ్యవస్థలోనే  వినికిడి సమస్య ఉన్నప్పటికీ లాయర్​గా అర్హత సాధించిన మొదటి వ్యక్తి అయ్యింది.  ఇప్పుడు ఆమె బెంగళూరు సెంటర్‌‌ ఫర్‌‌ లా అండ్‌‌ పాలసీ రీసెర్చ్‌‌ (సిఎల్‌‌పిఆర్‌‌)లో చేరింది.