చైల్డ్ పోర్న్​వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్​

చైల్డ్ పోర్న్​వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్​

చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్న వ్యక్తిని తెలంగాణ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​కు చెందిన ఓ ఎంసీఏ విద్యార్థి నిత్యం పోర్న్​ వీడియోస్​ ఇతరులకు షేర్​ చేస్తున్నాడు. ఈ విషయాన్ని అమెరికాలోని ఓ ఎజెన్సీ గుర్తించింది. 

ఇండియన్​ ఎంబసీ ద్వారా రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన సీఐడీ ఆఫీసర్లు అంబర్​పేటలో నిందితుడు ఉన్నట్లు గుర్తించారు. చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తున్నట్లు తెలిపారు.