అల్లు అర్జున్ తో సినిమా చాన్స్ అంటూ.. అమ్మాయిలతో..

అల్లు అర్జున్ తో సినిమా చాన్స్ అంటూ.. అమ్మాయిలతో..

తమ సంస్థ పేరు చెప్పి సినిమాలలో చాన్స్ ఇప్పిస్తానంటూ అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరో అల్లు అర్జున్ పక్కన తమిళ్ సినిమాలో హీరోయిన్ అవకాశం కల్పిస్తానంటూ ఓ వ్యక్తి అమ్మాయిలకు వల వేస్తున్నాడని గీతా ఆర్ట్స్ మేనేజర్ సత్య ఫిర్యాదులో పేర్కొన్నాడు. గీతా ఆర్ట్స్ లో తాను ఒక డిజైనర్ మరియు మేకప్ మెన్ అని చెప్పుకుంటూ ఆ వ్యక్తి అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నాడని మేనేజర్ సత్య తెలిపాడు. తమ బ్యానర్ పేరు చెప్పి అమ్మాయిలను మోసం చేస్తున్న ఆ వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని మేనేజర్ సత్య పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.