ఒకే వ్యక్తికి మూడు నెలల్లో రెండోసారి కరోనా

ఒకే వ్యక్తికి మూడు నెలల్లో రెండోసారి కరోనా

కరోనా రెండోసారి వచ్చింది
హాంకాంగ్ వ్యక్తికి కొత్త రకం స్ట్రెయిన్ తో వైరస్
యూరప్ నుంచి వచ్చిన వ్యక్తికి మళ్లీ వైరస్ పాజిటివ్
రీఇన్ఫెక్షన్ తో ఒక్కొక్కరిపై ఒక్కోలా ఎఫెక్ట్
వీరి నుంచి ఇతరులకూ వైరస్ సోకేందుకు చాన్స్

ఒకసారి కరోనా వచ్చిపోయిన వాళ్లకు మళ్లీ వైరస్ అంటుకునే చాన్స్ ఉందని తేలింది. ప్రపంచంలోనే తొలిసారిగా హాంకాంగ్ లో కరోనా రీఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. గతంలో కరోనా ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తికి టెస్టులు చేయగా వైరస్ మళ్లీ సోకినట్లు కన్ఫమ్ అయింది. అయితే అతడికి మొదటిసారి సోకిన కరోనా వైరస్, రెండోసారి సోకిన వైరస్ వేర్వేరు స్ట్రెయిన్ లకు చెందినవని సైంటిస్టులు గుర్తించారు. రెండోసారి ఆ వ్యక్తిలో ఎలాంటి సింప్టమ్స్ కన్పించలేదు.

హాంకాంగ్: ఒకసారి కరోనా వచ్చిపోయిన వాళ్లకు వైరస్ మళ్లీ అంటుకుంటోంది. ప్రపంచంలోనే తొలిసారిగా హాంకాంగ్ లో కరోనా రీఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. యూరప్ నుంచి ఇటీవల హాంకాంగ్ కు వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి ఎయిర్ పోర్టులో టెస్టులు చేయగా, వైరస్ మళ్లీ సోకినట్లు కన్ఫమ్ అయింది. ఆ వ్యక్తికి ఏప్రిల్ నెలలో కరోనా సోకగా, దాని నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పుడు వైరస్ మళ్లీపాజిటివ్ వచ్చింది. దీంతో ఒకసారి వైరస్ సోకిన వ్యక్తికి కొన్ని నెలల తర్వాత మళ్లీవైరస్ ఇన్ఫెక్ట్ అయ్యేందుకు చాన్స్ ఉంటుందనేందుకు ఈ కేసు ఫస్ట్ ఎగ్జాంపుల్ అని సైంటిస్టులు అంటున్నారు.

రెండోసారి నో సింప్టమ్స్..
హాంకాంగ్ వ్యక్తికి సోకిన వైరస్ స్ట్రెయిన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ను యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ సైంటిస్టులు స్టడీ చేశారు. దీంతో అతనికి మొదటిసారి సోకిన కరోనా వైరస్, ఈ కరోనా వైరస్ వేర్వేరు స్ట్రెయిన్ లకు చెందినవిగా గుర్తించారు. అయితే, రెండోసారి వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తిలో ఎలాంటి సింప్టమ్స్ కన్పించలేదని సైంటిస్టులు తెలిపారు. ఒకసారి కరోనానుంచి కోలుకున్న వారికి తర్వాత మళ్లీ వైరస్ సోకితే.. వాటి ఎఫెక్ట్ ఎక్కువగానే ఉండవచ్చని ఈ కేసును బట్టి సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

కరోనా ఎప్పటికీ మనతోనే..?
‘‘కరోనా ఇక మనుషుల్లో ఎప్పటికీ ఉండిపోవచ్చని మా స్టడీలో తేలిన అంశాలను బట్టి అంచనా వేస్తున్నాం. వ్యాక్సిన్ ల ద్వారా మనుషులు వైరస్ కు ఇమ్యూనిటీ పొందినా, సాధారణ జలుబుకు కారణమయ్యేలా ఈ వైరస్ అవశేషాలు భవిష్యత్తులోనూ వ్యాపిస్తూనే ఉండవచ్చు’’ అని యూనివర్సిటీకి చెందిన క్వోక్ యంగ్ యూన్ టీం సోమవారం ‘క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’ జర్నల్ లో పబ్లిష్ చేసిన తమ ఆర్టికల్ లో పేర్కొన్నారు.కొందరు పేషెంట్లలో సింప్టమ్స్ అన్నీ తగ్గిపోయినా, కొన్నివారాల పాటు వైరస్ కు పాజిటివ్ వస్తోందని సైంటిస్టులు తెలిపారు. అయితే, ఆల్రెడీ సోకిన వైరస్ కు సంబంధించిన అవశేషాల వల్ల అలా పాజిటివ్ వస్తోందా? లేకపోతే అది కొత్త ఇన్ఫెక్షనా? అనేది ఇంకా అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు.

రీఇన్ఫెక్షన్లను గుర్తించడం కష్టం..
కరోనావైరస్ బారిన పడి, పూర్తిగా కోలుకున్న వ్యక్తికి మళ్లీ కొత్తగా కరోనా ఇన్ఫెక్షన్ రావడాన్ని డాక్యుమెంటేషన్ చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని సైంటిస్టులు తెలిపారు. అయితే కరోనా నుంచి కోలుకుని మళ్లీ వైరస్ సోకినా, సింప్టమ్స్ కనిపించక పోతే, అలా రీఇన్ఫెక్ట్ అయిన వ్యక్తులను గుర్తించడం సాధ్యం కాదని బ్రిస్బేన్ కు చెందిన సైంటిస్ట్ కోరీ స్మిత్ చెప్పారు. రెండోసారి వైరస్ సోకినప్పుడు ఇమ్యూన్ సిస్టం రెస్పాండ్ అవడం వల్ల సింప్టమ్స్ ను అడ్డుకుని ఉండవచ్చని తెలిపారు.

ఇతరులకూ సోకుతుందా?
రెండోసారి వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు కూడా వైరస్ వ్యాపిస్తుందా ? అంటే అవుననే చెప్తున్నారు సైంటిస్టులు. కరోనా రీఇన్ఫెక్ట్ అయిన వారి నుంచి గతంలో వైరస్ బారిన పడని వ్యక్తులకు వైరస్ సోకే చాన్స్ ఉందని అంటున్నారు. రీఇన్ఫెక్షన్లు జరగడం అనివార్యమని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ థామస్ ఫిలే అన్నారు. అయితే మొదటి ఇన్ఫెక్షన్ తర్వాత ఎన్ని ఎక్కువ రోజులకు రీఇన్ఫెక్షన్ జరిగితే అంత ఎఫెక్ట్ తక్కువగా ఉండొచ్చన్నారు.

రీఇన్ఫెక్షన్ పైమరింత స్టడీ అవసరం: డబ్ల్యూహెచ్ వో
ప్రపంచవ్యాప్తంగా 2.40 కోట్ల మంది కరోనా బారిన పడ్డారని సోమవారం డబ్ల్యూహెచ్ వో టెక్నికల్ హెడ్ మరియా వాన్ కేర్ఖో వ్ వెల్లడించారు. చాలా మంది పేషెంట్లు, స్వల్ప లక్షణాలు కనిపించినవారిలో ఇప్పటికే ఇమ్యూన్ రెస్పాన్స్ ఏర్పడిందని ఆమె తెలిపారు. హాంకాంగ్ లో రీఇన్ఫెక్షన్ వంటి
కేసులను డాక్యుమెంట్ చేయడం చాలా అవసరమని, అయితే ఇప్పుడే దీనిపై ఎలాంటి నిర్ణయానికి రాకూడదన్నారు. ఎక్కువ కేసులను స్టడీ చేస్తేనే వైరస్ తీరును బాగా అర్థం చేసుకోవచ్చన్నారు. అప్పుడే.. కోలుకున్న పేషెంట్లలో కరోనా న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు ఎన్ని రోజులు ఉంటాయి? వారికి వైరస్ నుంచి ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుంది? అన్నవి తేలుతాయన్నారు.

ఒక్కొక్కరిపై ఒక్కోలా ఎఫెక్ట్..
కరోనా రీఇన్ఫెక్షన్ నుంచి అందరికీ రక్షణ ఉంటుందా? అంటే.. ఒక్కొక్కరికీ ఒక్కోలా ఎఫెక్ట్ ఉండొచ్చని సైంటిస్టులు అంటున్నారు. పేషెంట్ల ఆరోగ్యం, ఇమ్యూన్ సిస్టం,మొదటిసారి వైరస్ సోకినప్పుడు సింప్టమ్స్ రావడం, రెండోసారి సోకిన వైరస్ స్వభావం వంటి అంశాలను బట్టి రీఇన్ఫెక్షన్ వల్ల
ఒక్కొక్కరిలో ఒక్కోలా ఎఫెక్ట్ ఉండొచ్చని చెబుతున్నారు. ఇతర సీజనల్ కరోనా వైరస్ వ్యాధులను పరిశీలిస్తే.. వీటికి కొంతమందిలో ఐదారు నెలలులేదా ఏడాది వరకూ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందని అంటున్నారు.

For More News..

పెన్షన్ తెచ్చుకొనీకిపోతే.. 92 మందికి కరోనా

పోలీస్ టవర్స్ కు 300 కోట్లు అనుకుంటే.. 700 కోట్లు అయితుంది