అక్కపై కోపంతో కుక్కను చంపేశాడు..

అక్కపై కోపంతో కుక్కను చంపేశాడు..

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పరిధిలోని లాలాపేట్ లో అమానుష సంఘటన జరిగింది. అక్కపై కోపంతో కుక్కను చంపేశాడు ఓ వ్యక్తి. లాలాపేటలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అక్క రమాదేవి, తమ్ముడు నాగరాజు మధ్య కొన్నాళ్లుగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. రమాదేవితో గొడవ పడుతుండగా.. రమాదేవి కుక్క అడ్డువచ్చింది. కోపంతో.. నాగరాజు… ఆ కుక్క గొంతును కాలుతో బలంగా నొక్కాడు. దీంతో.. అది అక్కడికక్కడే చనిపోయింది.

పమేరియన్ జాతికి చెందిన తమ పెంపుడు కుక్కను నాగరాజు అత్యంత దారుణంగా చంపేశాడంటూ ఓయూ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసింది రమాదేవి. సెక్షన్  429 IPC, సెక్షన్ 11(i)(l) of ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ చట్టం ప్రకారం పోలీసులు నాగరాజుపై కేసు పెట్టారు. నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. కుక్క డెడ్ బాడీని.. పోస్టుమార్టమ్ కోసం.. నారాయణగూడ వెటర్నరీ హాస్పిటల్లో భద్రపరిచారు.