ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు.. చాలాకాలంగా ఫ్రెండ్స్.. ఫ్రెండిషిప్ ముదిరి ప్రేమకు దారితీసింది.. మధ్యలో ఏవో సమస్యలు.. ఆరు నెలల క్రితం విడిపోయారు. ఇక్కడి వరకు రోటీన్.. ఆ తర్వాత జరిగిందే దారుణం.. తనకు బ్రేకప్ చెప్పిందని కక్ష పెంచుకున్న ప్రియుడు, ప్రియురాలిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన పంజాబ్ లోని మొహాలీలో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేం ఘోరం.. బ్రేకప్ చెబితే లైట్ తీసుకోవాలి గానీ ఇలా చంపేస్తారా .. ఇదేం ప్రేమ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
మంగళవారం (జూన్ 2) పంజాబ్ లోని మొహాలీ సెక్టార్ 66 లో జరిగిన ఈ ఘటన స్థానికంగానే కాదు దేశవ్యాప్తంగా కలకలరేపుతోంది. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న డింపుల్ అనే 32 ఏళ్లు యువతినిహర్విందర్ సింగ్ కత్తితో పొడిచాడు. ఒకటికాదు రెండు కాదు 32 సార్లు కత్తితో డింపుల్ ను పొడిచాడు.. అనంతరం తాను కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. డింపుల్ రక్తమడుగులో గిలగిలా కొట్టుకొని చనిపోయింది. నిందితుడు హర్వీందర్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అందరూ చూస్తుండగానే డింపుల్ ను హర్విందర్ సింగ్ కత్తితో పొడుస్తున్న దృశ్యాలు సీసీటీవీ లో రికార్డయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డింపుల్, హర్విందర్ సింగ్ గతంలో ఓ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీలో కలిసి పనిచేశారు. ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే ఆరు నెలల క్రితం విడిపోయారు. గురువారం సాయంత్రం డింపుల్ ఆఫీసులో పనిచేస్తుండగా.. హర్విందర్ అక్కడికి వచ్చి వాగ్వాదానికి దిగాడు. మాటా మాటా పెరిగి కత్తితో డింపుల్ దాడి చేశాడు నిందితుడు. ఆఫీసులో ఉన్న వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారిని చంపేస్తానని బెదిరించి వారి కళ్లముందే డింపుల్ అత్యంత దారుణంగా చంపేశాడు.
దాడి తర్వాత ఇద్దరినీ ఆస్పత్రికి తరలించడగా డింపుల్ అప్పటికే మృతిచెందింది. హర్విందర్ చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన రేకెత్తించింది.
Totally deranged man. Stabbed his ex-girlfriend to death. Shocking visuals. https://t.co/IT3lZ8dtvo
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 5, 2026
