అపచారం: గరుడసేవలో అపశ్రుతి... వాలిపోయిన స్వామి విగ్రహం

అపచారం: గరుడసేవలో అపశ్రుతి... వాలిపోయిన స్వామి విగ్రహం


అపచారం.. స్వామికి ఏదో లోటు చేశారు.. అందువల్ల ఉన్నట్లుండి స్వామి విగ్రహం ఒరిగిపోయిందన్నది అక్కడికి వచ్చిన భక్తుల నుంచి బలంగా వినిపిస్తున్నమాట అసలేం జరిగిందంటే..

తమిళనాడులోని తిరువొత్తియూర్ కల్యాణ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవను నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా వాహనం పక్కకు వాలిపోయింది. గరుడ వాహనాన్ని మోసే కర్ర బలంగా లేకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొందరు సిబ్బంది, అర్చకుడికి స్వల్పగాయాలయ్యాయి. అనంతరం అందరూ లేచి మళ్లీ స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా కొత్త వాహనం, కొయ్యలను అధికారులు తీసుకురాలేదని ఆలయ సిబ్బంది వాపోతున్నారు. అధికారుల వల్లే అపశ్రుతి అంటూ భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడులోని తిరువొత్తియూర్ కల్యాణ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో గరుడ సేవ నిర్వహిస్తున్నారు. స్వామి పల్లకి మోసేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అపశృతి తలెత్తకుండా పలుమార్లు పల్లకిని పరిశీలించారు నిర్వాహకులు. గరుడ సేవ అనేసరికి భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు.వచ్చిన వారిలో స్వామిని కళ్లారా చూద్దామనే అనుకునేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు.అయితే ఏం జరిగిందో తెలీదుగానీ కల్యాణ వరదరాజ పెరుమాళ్ స్వామి పల్లకి ఓ వైపు పూర్తిగా ఒరిగిపోయింది. చివరకు చుట్టుపక్కల ఉన్న భక్తులు విగ్రహం వద్దకు వచ్చిన కిందపడిపోకుండా చూశారు. ఈ క్రమంలో కొందరు సిబ్బంది గాయపడ్డారు. అలాగే ప్రధాన అర్చకుడికి గాయాలయ్యాయి.

గరుడ వాహనాన్ని మోసే కర్రలు బలంగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. వాహనానికి కొత్త కర్రలు తీసుకురావాలని పలుమార్లు చెప్పినా తీసుకురాలేదని ఆలయ సిబ్బంది వైపు నుంచి బలంగా వినిపిస్తున్నమాట. దీని వెనుక ముమ్మాటికీ అధికారులదే నిర్లక్ష్యమేనని భక్తులు అంటున్నారు. ఈ వ్యవహారంపై ఆలయ నిర్వాహకులు సైలెంట్ అయిపోయారు.