
సీపీకి పెరుమాండ్లగూడెం రైతుల ఫిర్యాదు..
హనుమకొండ, వెలుగు:పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారంటూ హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం రైతులు సీపీకి ఫిర్యాదు చేశారు. ల్యాండ్ పూలింగ్ జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెంకు వచ్చిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. మద్యం తాగి వచ్చి ఎమ్మెల్యేను అడ్డుకున్నారని, పోలీస్‌ఆఫీసర్ డ్యూటీకి అడ్డు తగిలారని ఏఎస్సై సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన కల్పగిరి శ్రీనివాస్, ఆయన కొడుకు నిరంజన్, బంధువు వరంగంటి మురళితో పాటు మరో తొమ్మిది మందిపై ఐనవోలు స్టేషన్లో అదే రోజు సాయంత్రం కేసు నమోదు చేశారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఐనవోలు ఎస్సై భరత్ కుమార్,కానిస్టేబుల్స్ఆందోళనలో పాల్గొన్న శ్రీనివాస్,నిరంజన్,మురళిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు విడిచిపెట్టారు.అప్పటికే పోలీసులు కొట్టడంతో గాయపడ్డ నిరంజన్, మురళి హనుమకొండలోని ప్రైవేట్దవాఖానాలో ట్రీట్మెంట్ తీసుకున్నారు.తీవ్రంగా కొట్టడం వల్లే గాయాలైనట్లు తేలడంతో బాధితులు మెడికల్రిపోర్టుల ఆధారంగా వరంగల్సీపీకి శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.బట్టలు విప్పి,కాళ్లు,చేతులు వెనక్కి కట్టేసి చిత్రహింసలు పెట్టారని,రెండు సార్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వాపోయారు.వారి వెంట బీజేపీ హనుమకొండ,వరంగల్ జిల్లా అధ్యక్షుడు రావు పద్మ,కొండేటి శ్రీధర్,డీసీసీ ప్రెసిడెంట్నాయిని రాజేందర్‌రెడ్డి,రైతు జేఏసీ నాయకులు బుద్దె పెద్దన్న ఉన్నారు.తీన్మార్మల్లన్న టీమ్ సభ్యులు రజనీకుమార్ తదితరులు బాధిత రైతులతో మాట్లాడారు.వారికి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్‌తరఫున పోరాటం చేస్తామని హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్నాయిని రాజేందర్‌రెడ్డి చెప్పారు.
ఎస్సై,సీఐలను సస్పెండ్ చేయాలె:
బండి సంజయ్ పెరుమాండ్లగూడెంకు చెందిన శ్రీనివాస్,నిరంజన్,మురళి అనే రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను సస్పెండ్ చేయాలని బీజేపీ స్టేట్ చీఫ్బండి సంజయ్ డిమాండ్‌చేశారు.బాధిత రైతుల వద్దకు వెళ్లిన హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అక్కడి నుంచి బండి సంజయ్‌కు ఫోన్ చేసి మాట్లాడించారు.తర్వాత సంజయ్హైదరాబాద్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.పోలీసులు అర్ధరాత్రి ఇంటి గోడ దూకి దొంగల మాదిరిగా కిడ్నాప్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏమిటని ప్రశ్నించారు.పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమన్నారు.ఘటనకు కారణమైన సీఐ విశ్వేశ్వర్,ఎస్సై భరత్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.బాధితుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.