పీఈసెట్ దరఖాస్తు గడువు పెంపు

పీఈసెట్ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే  తెలంగాణ స్టేట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) దరఖాస్తు గడువును ఆగస్టు 12 వరకు పొడిగించామని పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, డిగ్రీ ఫలితాలు ఇంకా రాకపోవడం తదితర అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు https://pecet.tsche.ac.in  వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకూ 3,047 మంది అప్లై చేశారని చెప్పారు.