అమెరికా ఆర్మీ చీఫ్ తొలగింపు : ఇరాన్ యుద్ధం మధ్యలో మార్పు ఎందుకు..?

అమెరికా ఆర్మీ చీఫ్ తొలగింపు : ఇరాన్ యుద్ధం మధ్యలో మార్పు ఎందుకు..?

ఇరాన్ దేశంపై భీకంగా యుద్ధం నడుస్తుంది. గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టనుంది. ఇప్పటికే 3 వేల మంది అమెరికా సైన్యం ఇరాన్ లో గ్రౌండ్ ఆపరేషన్ కోసం గల్ఫ్ దేశాలకు చేరుకున్నాయి. యుద్ధం మధ్యలో.. అమెరికా ఆర్మీ చీఫ్ రాండీ ఏ జార్జ్ ను మధ్యంతరంగా తొలగించటం చర్చనీయాంశం అయ్యింది.

ఇరాన్తో భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా నిర్ణయం షాకింగ్ కు గురిచేస్తోంది. యూఎస్ ఆర్మీ చీఫ్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది.  యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని రక్షణ శాఖా కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ ఆదేశించారు. వెంటనే రిటైర్ కావాలని అడగటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంగా మారిందనే చెప్పాలి.

ఆర్మీ చీఫ్ ను రిటైర్ కావాలని హెగ్ సెత్ ఆదేశించిన విషయాన్ని పెంటగాన్ ధృవీకరించింది. అయితే ఆర్మీ చీఫ్ తో పాటు ఎఫ్‌బిఐ డైరెక్టర్ కాష్ పటేల్, ఆర్మీ సెక్రటరీ డేనియల్ డ్రిస్కాల్, కార్మిక శాఖ సెక్రటరీ లోరీ చావెజ్-డిరెమెర్ కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తొలగిస్తారనే చర్చలు జరిగినట్లు రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. 

దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అట్లాంటిక్ వెల్లడించింది. రాయిటర్స్ సమాచారం ప్రకారం, ముఖ్య నాయకత్వ మార్పు దిశగా  పెంటాగాన్‌ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  అమెరికా ప్రభుత్వం ప్రాధాన్యతలతో ఆర్మీ నాయకత్వంలో సమూల మార్పులు తీసుకుంటున్నట్లు  అధికారులు తెలిపారు. ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్ యూఎస్ ఆర్మీకి 41వ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. 

లిస్టులో టాప్ మిలిటరీ జనరల్స్:

అమెరికా రక్షణ శాఖా కార్యదర్శి పీట్ హెగ్‌సెత్, టాప్ మిలిటరీ జనరల్స్‌ను తొలగించే విషయంలో వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.  అధ్యక్షుడు ట్రంప్ జాతీయ భద్రతా అజెండాను అమలు చేయడానికి పెంటాగాన్‌ను పూర్తిగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే డజనుకి పైగా టాప్ జనరల్స్, అడ్మిరల్స్ తొలగించగా.. అదేబాటలో జనరల్ రాండీ జార్జ్‌ను కూడా తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

హెగ్‌సెత్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటికే ఎంతో మంది ఉన్నత స్థాయి సైనికాధికారులను తొలగించారు. గత ఫిబ్రవరిలో జరిగిన మొదటి రౌండ్ తొలగింపుల్లో జార్జ్ బయటపడ్డా, ఇప్పుడు అతన్ని కూడా తప్పించేశారు. ఆ సమయంలో నేవీ చీఫ్ అడ్మిరల్ లిసా ఫ్రాన్చెట్టి, ఎయిర్‌ఫోర్స్ నంబర్ టూ జనరల్ జిమ్ సిల్ఫ్‌ను తొలగించారు. అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ చార్లెస్ ‘CQ’ బ్రౌన్‌ను కూడా తొలగించారు.

గల్ఫ్, ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల్లో కీలక పాత్ర:

జనరల్ రాండీ జార్జ్ ఆర్మీ వైస్ చీఫ్‌గా కూడా పనిచేశారు. వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి పట్టభద్రుడైన ఇన్ఫాంట్రీ అధికారి అయిన జార్జ్, ఫస్ట్ గల్ఫ్ వార్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం కలిగిన సీనియర్ ఆఫీసర్. 2023లో ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమితులయ్యారు. జార్జ్ తో పాటు అతని డెప్యూటీ జనరల్ జేమ్స్ మింగస్ కు ఉధ్వాసనకు గురయ్యారు.