V6 News

రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో మానుకోటలో ఏర్పాటు చేయాలి: డిపో సాధన కమిటీ

రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో మానుకోటలో ఏర్పాటు చేయాలి: డిపో సాధన కమిటీ

మహబూబాబాద్, వెలుగు: రైల్వే శాఖ ద్వారా మంజూరైన రైల్వే మెగా మెయిన్ టెనన్స్ డిపో నిర్మాణం మానుకోటలోనే నిర్మించాలని కోరుతూ మంగళవారం రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్ నిలయంలో డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్ కు వినతి పత్రం అందించారు. 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్ట్ ను ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను నిలపాలని కోరారు. మహబూబాబాద్ లో అనువైన ప్రభుత్వ స్థలం, ప్రత్యేకించి గిరిజన ప్రాంతంగా అత్యంత నిరాధారణకు గురై 70 ఏండ్లు ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధికి నోచుకో లేదన్నారు. రైల్వే మెగా ప్రాజెక్ట్ వస్తే ఈ ప్రాంత అభివృద్ధితో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. కార్యక్రమంలో సాధన కమిటీ కన్వీనర్  డోలి సత్యనారాయణ, మైస శ్రీనివాస్, పిల్లి సుధాకర్, గుగ్గిళ్ల పీరయ్య మాదిగ, గోనె శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.