భారీ వర్షాలు.. నష్టంపై హైకోర్టులో పిటిషన్​.. విచారణ వాయిదా

భారీ వర్షాలు.. నష్టంపై హైకోర్టులో పిటిషన్​.. విచారణ వాయిదా
  • మృతుల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందన్న పిటిషనర్స్​

రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు జరిగిన నష్టాలపై హైకోర్టు జులై 31న విచారణ జరిపింది. వరద సహాయక చర్యలు తదితర అంశాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. అయితే ప్రభుత్వ నివేదిక తప్పులతడకగా ఉందని పిటిషనర్స్​ వాదించారు. 

వరదలతో 41 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని మృతుల సంఖ్య ఎక్కువే ఉంటుందని పిటిషర్స్ అన్నారు. ఆ నివేదికపై సమగ్ర వివరాలతో వాదనలు వినిపిస్తామని వారు తెలిపారు. 

అయితే చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.