లాక్ డౌన్ ఎఫెక్ట్.. పెట్రోల్‌, డీజిల్‌ వాడట్లే

లాక్ డౌన్ ఎఫెక్ట్.. పెట్రోల్‌, డీజిల్‌ వాడట్లే

న్యూఢిల్లీ: లాక్‌‌డౌన్‌‌ దెబ్బతో గత నెలలో పెట్రోల్‌‌, డీజిల్‌‌ వినియోగం భారీగా పడింది. పేదలకు వంట గ్యాస్‌‌ సిలిండర్లను ప్రభుత్వం ఫ్రీగా  ఇస్తుండడంతో  ఎల్‌‌పీజీ వినియోగం మాత్రం కొద్దిగా పెరిగింది. ఏప్రిల్‌‌ నెలలో పెట్రోల్‌‌ సేల్స్‌‌ 60.43 శాతం తగ్గి 9.73 లక్షల టన్నులగా నమోదయ్యాయి. గత నెల మొదటి పదిహేను రోజుల్లో ఈ పతనం 64 శాతంగా ఉంది. ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో  తర్వాత పదిహేను రోజుల్లో పెట్రోల్‌‌ సేల్స్‌‌ కొంత పుంజుకున్నాయి. అదే విధంగా డీజిల్‌‌ వాడకం కూడా ఏప్రిల్‌‌ నెలలో భారీగా పడిపోయింది. లాక్‌‌డౌన్‌‌ దెబ్బతో ఫ్యాక్టరీలన్ని నిలిచి పోయిన విషయం తెలిసిందే.  దీంతో గత నెల మొదటి పదిహేను రోజుల్లో డీజిల్‌‌ వినియోగం 61 శాతం పడింది. ఫ్యాక్టరీలు రీఓపెన్‌‌ అవ్వడంతో తర్వాత పదిహేను రోజుల్లో డీజిల్‌‌ వినియోగం కొంత పుంజుకుంది. మొత్తంగా ఏప్రిల్‌‌ నెలలో డీజిల్‌‌ సేల్స్‌‌ 55.6 శాతం పడిపోయి  32.5 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. ఎల్‌‌పీజీ సేల్స్‌‌ మాత్రం 12.2 శాతం పెరిగి 21.3 లక్షల టన్నులకు చేరుకుంది.