భారీగా పెరగనున్న పెట్రోల్,డీజిల్ ధరలు

 భారీగా పెరగనున్న పెట్రోల్,డీజిల్ ధరలు

రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ తో  భారత్‌లో పెట్రోల్,డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తోంది.అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధర పెరగడమే ఇందుకు సంకేతం.యుక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో యుద్ధ వాతావరణం నెలకొనగా.. ముడి చమురు ధర బ్యారెల్‌ 100 డాలర్లకు చేరుకుంది.2014 సెప్టెంబర్ తర్వాత ముడి చమురు బ్యారెల్‌ 100 డాలర్లకు చేరడం ఇదే మొదటి సారి. రష్యా,ఉక్రెయిన్ మధ్య యుద్ధం భారీగా సాగితే  ముడి చమురు మరింత ఖర్చుతో కూడుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ముడి చమురు ధరలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ పరిశోధనా సంస్థల ప్రకారం.. రాబోయే రోజుల్లో ముడి చమురు ధర 100డాలర్లు కంటే ఎక్కువగా ఉండొచ్చు. రెండు నెలలుగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి.2022లో ముడి చమురు ధరలు 25 శాతానికి పైగా పెరిగాయి, గత రెండు నెలలుగా, ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు కానీ, ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మాత్రం కచ్చితంగా భారీ మార్పు కనిపించే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 4, 2021 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. కానీ, ఇప్పుడు ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరల్లో కచ్చితంగా మార్పు చేయవచ్చు.

భారత్ ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపై ఆధారపడింది.అందువల్లే క్రూడ్ ధరలు అనేవి పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంకా డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పన్నులు, రూపాయి డాలర్ విలువలో మార్పు, రిఫైనరీ కన్సప్చన్ రేషియో వంటి అంశాలు ఇంధన ధరలపై ఎఫెక్ట్ చూపనున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

రష్యా యుద్ధ ప్రకటన ఎఫెక్ట్.. పెరిగిన బంగారం ధర