గడచిన రెండు వారాల వ్యవధిలోనే భారత ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను లీటరుకు దాదాపు రూ.7.50 వరకూ పెంచింది. దీంతో దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కొంత ఊరట లభించింది. ఇరాన్ యుద్ధం స్టార్ట్ కావటానికి ముందు బ్యారెల్ క్రూడ్ 73 డాలర్ల వద్ద ఉండగా.. అది మార్చిలో అత్యధికంగా 120 డాలర్లకు చేరుకోవటంతో చమురు సంస్థలకు భారీగా నష్టాలు వచ్చాయి. ఒకానొక దశలో రోజుకు రూ.16వందల కోట్లు నష్టపోయినట్లు ప్రభుత్వమే ప్రకటించిన సంగతి తెలిసిందే.
దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడెప్పుడు క్లోజ్ అవుతాయా రేట్లు పెంచేద్దామా అని మోడీ సర్కార్ ఆగింది. ఆయిల్ కంపెనీల నుంచి ప్రెజర్ వచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం ఉంటుందని, దానివల్ల ఓటు బ్యాంక్ తగ్గొచ్చనే ముందస్తు అంచనాలతో రిజల్ట్స్ వచ్చిన నాటి నుంచి రూపాయి రూపాయి చొప్పున రేట్లు పెంచింది కేంద్ర ప్రభుత్వం. అయితే నేడు సోమవారం 4వ విడతలో భాగంగా పెట్రోలుపై లీటరుకు రూ.2.61 పెంచగా.. డీజిల్ పై రూ.2.71 మేర పెంపు ప్రకటించింది.
►ALSO READ | తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్లు.. వెండి రేట్లలో చలనం లేదు.. హైదరాబాద్ రేట్లివే..
చాలా మంది అరే ఇప్పటికే దాదాపు రూ.7.53 వరకూ పెంచారుగా ఇంతటితో ఆపితే బాగుండు ఈ బాదుడు అనుకుంటున్నారు. కానీ గుర్తించాల్సిన వాస్తవం ఏంటంటే ఇంకా మోడీ ప్రభుత్వం చమురు కంపెనీలకు వస్తున్న నష్టాలను తగ్గించటం కోసం కనీసం లీటరుకు మరో రూ.18 మేర రేట్లను పెంచక తప్పదట. ఇది కూడా ప్రజలకు నొప్పి తెలియకుండా వారానికి ఒకసారో రెండుసార్లో చిన్న మెుత్తాల్లో పెంచటం ఖాయం అంటున్నారు నిపుణులు.
మరి యుద్ధం ముగిసి శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతుంటంతో ఇవాళ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు 100 డాలర్ల కంటే దిగువకు జారింది. రానున్న రోజుల్లో చర్చలు ఫలవంతం అయితే మళ్లీ బ్యారెల్ రేటు 80 డాలర్ల కంటే దిగువకు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే వచ్చే నెలరోజుల్లో పరిస్థితులు చక్కబడి రేట్లు తగ్గి పూర్వపు స్థాయికి వచ్చినా పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం అలాగే కొనసాగుతాయ్. కంపెనీలకు గతంలో వచ్చిన నష్టాలు పూడే వరకూ మోడీ ప్రభుత్వం రేట్లను తగ్గించకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే రానున్న రెండు మూడేళ్ల వరకూ దాదాపుగా పెరిగిన ధరలే కొనసాగవచ్చని తెలుస్తోంది.
