మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు బ్రేకులు పడడం లేదు. చమురు కంపెనీల నిర్ణయంతో సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్ , డీజిల్ ధరలను మరోసారి పెంచాయి ఆయిల్ కంపెనీలు. వరుసగా నాలుగో రోజు లీటర్ పై 39 పైసల వరకు బాదాయి. ఈ నెలలో ధరలు పెరగడం ఇది ఆరోసారి. పెరిగిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్  లీటర్ కు 88 రూపాయల 14 పైసలు, డీజిల్  78 రూపాయల 38 పైసలకి చేరింది. హైదరాబాద్ లో లీటర్  పెట్రోల్  91 రూపాయల 65 పైసలు, డీజిల్  85 రూపాయల 50 పైసలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్   ఏకంగా 94 రూపాయల 64 పైసలుండగా….  చెన్నైలో 90 రూపాయల 44 పైసలకు చేరింది.  పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు పెట్రోల్, డీజిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు VAT, ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని డిమాండ్ చేశారు ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సల్. ప్రస్తుతం పెట్రోల్ రేట్ లో 70శాతం ట్యాక్సెస్ ఉంటున్నాయన్నారు. వన్ నేషన్ వన్ రేట్ పద్దతిలో పెట్రోల్, డీజిల్ లను GSTలో చేర్చాలన్నారు. పెట్రోల్, డీజిల్ పై 28శాతం GST వేసినా… ధరలు చాలా వరకు తగ్గుతాయన్నారు అజయ్ బన్సల్.