పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించిన మహారాష్ట్ర సర్కార్

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించిన మహారాష్ట్ర సర్కార్

పెట్రోల్, డీజిల్ ధరల పై వ్యాట్ తగ్గిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. చమురు ధరలను తగ్గించారు. పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 3 రూపాయలు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు.  సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో పెట్రోల్ ధర  గత 11 రోజులుగా రూ. 111.35 వద్ద స్థిరంగా ఉండగా,  షిండే తాజా నిర్ణయంతో ఇప్పుడు రూ.106.35 అవుతుంది. ఇక రూ.97.28గా ఉన్న డీజిల్  రూ. 94.28కే లభ్యం కానుంది.  మహా కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి ఏడాదికి మరో 6 వేల కోట్ల అదనంగా ఖర్చవ్వనుంది. కానీ ఇంధనం ధరల తగ్గింపుతో ద్రవ్యోల్బణం తగ్గుతుందని సర్కారు విశ్వాసం వ్యక్తం చేసింది. కాగా తగ్గిన  కొత్త రేట్లు రేప‌టి నుంచి అమ‌లుకానున్నాయి.