హైదరాబాద్ లో రికార్డ్ స్థాయికి పెట్రోల్ ధర

హైదరాబాద్ లో రికార్డ్ స్థాయికి పెట్రోల్ ధర

వాహనదారులపై పెట్రోల్ ధరల బాధుడు కొనసాగుతోంది. పెట్రోల్ ధరలు వరుసగా రెండో రోజు రేట్లు పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి రేట్లు చేరగా….మరోసారి చమురు కంపెనీలు ధరలు పెంచాయి. దీంతో ఆల్ టైం రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇవాళ లీటర్ పై 30 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 86 రూపాయల 95 పైసలకు చేరింది. డీజిల్ 77 రూపాయల 13 పైసలకు చేరింది. అటు ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్  93 రూపాయల 49 పైసలకు చేరగా… లీటర్ డీజిల్ 83 రూపాయల 99 పైసలుగా ఉంది.

మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 89.39 పైసలుండగా….  డీజిల్ ధర 82 రూపాయల 33 పైసలకు చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 90 రూపాయల 42 పైసలుండగా… డీజిల్ ధర 84 రూపాయల 14 పైసలుగా ఉంది. అటు APలో లీటర్ పెట్రోల్ 92. 78 పైసలుండగా… డీజిల్ 85 రూపాయల 99 పైసలుగా ఉంది.  కోల్ కతాలో పెట్రోల్  88 రూపాయల 30 పైసలకు చేరుకోగా… డీజిల్ 80 రూపాయల 71 పైసలుగా ఉంది.

పెట్రోలో ధరలు భారీగా పెరగటంపై మండిపడతున్నారు వాహనదారులు. ఆయిల్ ధరలు పెరగటంతో… బండ్లు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. అటు ట్రాన్స్ పోర్ట్ చార్జీలు పెరిగాయని… దీంతో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెంచినట్లు తెలిపారు. వెంటనే చార్జీలు తగ్గించేలా… ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు.

see more news

ఖతర్నాక్ డ్రోన్.. గాల్లోకి లేచిందంటే మూడ్నేళ్లు ఆకాశంలోనే

కారులో వచ్చి ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్

ఫోన్ నుంచి మెసేజ్ పెట్టి.. చున్నితో భార్యను హత్య చేసిన భర్త