14 రోజుల్లో పన్నెండోసారి పెరిగిన పెట్రోల్ రేటు

14 రోజుల్లో పన్నెండోసారి పెరిగిన పెట్రోల్ రేటు

పెట్రోల్ రేట్ల పెంపునకు బ్రేకులు పడట్లేదు. మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్ పై 40 పైసలు చొప్పున పెంచాయి. గత 14 రోజుల వ్యవధిలో ధరలు పెంచడం ఇది 12 వసారి. రెండు వారాల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ పై సుమారు 9 రూపాయల చొప్పున రేట్లు పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 117 రూపాయల 61 పైసలు, డీజిల్ 103 రూపాయల 70 పైసలకు పెరిగింది.

ఢిల్లీలో పెట్రోల్ 103 రూపాయల 81 పైసలు, డీజిల్ 95 రూపాయల 7 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ 118 రూపాయల 83 పైసలు, డీజిల్ 103 రూపాయల 7 పైసలకు పెరిగింది. కోల్ కతాలో పెట్రోల్ 113 రూపాయల 45 పైసలు, డీజిల్ 98 రూపాయల 22 పైసలుగా ఉంది. చెన్నైలో పెట్రోల్ 109 రూపాయల 34 పైసలు, డీజిల్ 99 రూపాయల 42 పైసలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ 109 రూపాయల 41 పైసలు, డీజిల్ 93 రూపాయల 23 పైసలకు పెరిగింది. విశాఖలో పెట్రోల్ 119 రూపాయల 5 పైసలు, డీజిల్ 104 రూపాయల 72 పైసలుగా ఉంది.