వ‌రుస‌గా నాలుగో రోజు పెట్రోల్ ధ‌ర పెంపు

వ‌రుస‌గా నాలుగో రోజు పెట్రోల్ ధ‌ర పెంపు

క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో 82 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల జోలికి రాని ఆయిల్ కంపెనీలు నాలుగు రోజుల నుంచి వ‌రుస‌గా రేట్లు పెంచుకుంటూ వ‌స్తున్నాయి. జూన్ 7 నుంచి మొద‌లు పెట్టి ప్ర‌తి రోజూ ధ‌ర‌ల‌ను రివైజ్ చేస్తున్నాయి. బుధ‌వారం లీట‌రుకు పెట్రోల్ పై 40 పైస‌లు, డీజిల్ పై 45 పైస‌లు పెంచాయి.

ఈ నాలుగో రోజుల్లో మొత్తంగా పెట్రోల్ పై లీట‌రుకు రూ.2.14, డీజిల్ పై రూ.2.23 చొప్పున సామాన్యుడిపై భారం పెరిగింది. తాజా వ‌డ్డ‌న‌తో ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.73.40కి చేరింది. అలాగే డీజిల్ రేటు రూ.71.17కు పెరిగింది. రాష్ట్రాల వారీగా ట్యాక్సుల‌ను బ‌ట్టి ఈ ధ‌ర‌ల్లో కొంత హెచ్చుత‌గ్గులు ఉంటాయి.

నాలుగు రోజులుగా ధ‌ర‌ల పెంపు ఇలా..

పెట్రోల్                            డీజిల్
ఆదివారం                 60 పైస‌లు                     60 పైస‌లు
సోమ‌వారం               60 పైస‌లు                     60 పైస‌లు
మంగ‌ళ‌వారం          54 పైస‌లు                      58 పైస‌లు
బుధ‌వారం               40 పైస‌లు                      45 పైస‌లు