
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 25 శాతం తగ్గడంతో వరుసగా ఆరు రోజులపాటు పెట్రో ధరలు తగ్గాయి. మంగళవారం డీజిల్‌పై 13 పైసల చొప్పున, పెట్రోల్ ధర 25పైసల చొప్పున తగ్గినా, బుధవారం మాత్రం ధరలు మారలేదు. అయితే డీజిల్ ధర 13 నెలల, పెట్రోల్ ధరలు తొమ్మిది నెలల కనిష్టానికి చేరాయి. ఇక బుధవారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.70.33లు, డీజిల్ ధర రూ.63.05లుగా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.75.97గా, డీజిల్ ధర రూ.65.95 కాగా, చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.73 కాగా, డీజిల్ ధర రూ.66.46లకు తగ్గింది. హైదరాబాద్‌లో వీటి ధరలు వరుసగా రూ.74.70, రూ.68.59లుగా రికార్డయ్యాయి. గత ఎనిమిది నెలల్లో పెట్రో ధరలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి.