మాస్క్ పెట్టుకుని వ‌స్తేనే.. పెట్రోల్

మాస్క్ పెట్టుకుని వ‌స్తేనే.. పెట్రోల్

హైద‌రాబాద్‌: క‌రోనా క‌ట్ట‌డిలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాలంటూ పెట్రోలియం డీల‌ర్స్ అసొసియేష‌న్ రూల్ పెట్టింది. ముఖానికి మాస్క్‌లు లేకుండా వ‌చ్చే వారికి పెట్రోల్ పోయ‌రాదు అని నిర్ణ‌యించిన‌ట్లు డీల‌ర్స్ సంఘం తెలిపింది. త‌మ సిబ్బంది భద్ర‌తా దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పింది. ప‌లు పెట్రోల్ బంకుల్లో ఇప్ప‌టికే ఈ రూల్ కొన‌సాగుతుండ‌గా.. అన్ని బంకుల్లో పాటించాల‌ని తెలిపింది.

దీంతో కొన్ని ఇండియ‌న్ ఆయిల్ పెట్రోల్ పంపు వ‌ద్ద మాస్క్ లేని క‌స్ట‌మ‌ర్ల‌కు పెట్రోల్ పోయ‌డం లేదు. మ‌హమ్మారి త‌గ్గే వ‌ర‌కు ఇలాగే ఆంక్ష‌లు ఉంటాయ‌ని తెలిపింది. పెట్రోల్ పంపుల వ‌ద్ద జ‌నం గుమ్మిగూడే ప్ర‌మాదం ఉందని.. కోవిడ్ 19 నుంచి జాగ్ర‌త్త‌గా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది ఆల్ ఇండియా పెట్రోలియం డీల‌ర్స్ అసోసియేష‌న్.