కరోనాకు మరో మందు తయారు చేసిన ఫైజర్

కరోనాకు మరో మందు తయారు చేసిన ఫైజర్
  • పాక్స్​లొవిడ్​ డ్రగ్స్​తో మంచి రిజల్ట్స్​: కంపెనీ

వాషింగ్టన్: కరోనా ట్రీట్ మెంట్ కోసం అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ కొత్త యాంటీవైరల్​పిల్​ను అందుబాటులోకి తీసుకురానుంది. ‘పాక్స్​లొవిడ్’ ​గా పిలిచే ఈ పిల్​ వేసుకుంటే మరణించే,  హాస్పిటలైజ్​అయ్యే అవకాశాలు 89 శాతం తగ్గినట్టు తమ ట్రయల్స్​లో తేలిందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది చివరలో మరో రెండు స్టడీలు చేస్తామని, అమెరికాలో డ్రగ్​వాడకానికి అప్రూవల్​కోసం త్వరలో అప్లై చేసుకుంటామని చెప్పింది. 775 మందిపై చేసిన ప్రిలిమినరీ ట్రయల్స్​ఫలితాలను ఫైజర్​శుక్రవారం విడుదల చేసింది. ఫైజర్​పిల్​తీసుకున్న కరోనా రోగుల్లో హాస్పిటలైజేషన్, డెత్​రేటు 89 శాతం తగ్గిందని తెలిపింది. తమ డ్రగ్​తీసుకున్న వాళ్లలో 1 శాతం కన్నా తక్కువ మందే హాస్పిటలైజ్​అయ్యారని, ఎవరూ చనిపోలేదని చెప్పింది. పాక్స్​లొవిడ్​ తీసుకున్న పేషెంట్లు ఎవరూ వ్యాక్సిన్​ వేసుకోలేదంది. వీళ్లకు లక్షణాలు కనిపించిన 3 నుంచి 5 రోజుల తర్వాత ట్రీట్​మెంట్ ​స్టార్ట్​చేశామని తెలిపింది.

మాల్నుపిరావిల్ ​తర్వాత రెండో డ్రగ్​

కరోనాపై పోరాటానికి ఫైజర్​తయారు చేసిన పాక్స్​లొవిడ్​ రెండో డ్రగ్. ఇప్పటికే మెర్క్స్​కంపెనీ.. తమ మాల్నుపిరావిల్ ను కరోనా ట్రీట్​మెంట్​వాడొచ్చని, తమ ట్రయల్స్​లో 50% మంచి ఫలితాలు కనిపించాయని ఈ సెప్టెంబర్​లో వెల్లడించింది. అప్రూవల్​కోసం అమెరికాలో అప్లై చేసుకుంది. డ్రగ్​అనుమతికి సంబంధించి ఈ నెలలో మెర్క్స్​తో ఎఫ్​డీయే మీటింగ్​జరగబోతోంది. మాల్నుపిరావిల్​వాడకానికి ఇప్పటికే బ్రిటన్​అనుమతిచ్చింది. అమెరికాలో ప్రస్తుతం రెమ్​డెసివిర్​డ్రగ్​ను మాత్రమే కరోనాకు వాడుతున్నారు.