పీజీఈసెట్‌‌‌‌‌‌‌‌లో 4,221 మందికి సీట్ల కేటాయింపు

పీజీఈసెట్‌‌‌‌‌‌‌‌లో 4,221 మందికి సీట్ల కేటాయింపు
  • మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి... మరో 1,117 సీట్లు ఖాళీగా  ఉన్నట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఎంఈ, ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తైంది. కన్వీనర్ కోటాలో ఉన్న 5,338 సీట్లకు గాను 4,221 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈ విడత కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌లో 7,750 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను అలాట్​చేసినట్లు అధికారులు తెలిపారు. 

ఇంకా 1,117 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఈ నెల 27 నుంచి 30వ తేదీ లోపు కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కన్వీనర్​ సూచించారు.