
తెలంగాణ పీజీటీ గురుకుల ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణలో టెక్నికల్ ఇష్యూ ఏర్పడటంతో అభ్యర్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాబ్లమ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి(ఆగస్టు 21) ఇంగ్లీష్ పరీక్ష ఇంకా ప్రారంభం కాలేదు.
ఉదయం 8:30 గంటలకే పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా, పరీక్షా కేంద్రాల్లోకి ఇంకా అభ్యర్థులను అనుమతించడం లేదు. సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఎక్జామ్ఆలస్యమైనట్లు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు.
పీజీటీ ఇంగ్లీష్ పరీక్ష కోసం కేంద్రాలకు అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో పరీక్ష నిర్వహణ ఆలస్యంపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.