డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో రాబోతున్న నాగశౌర్య

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో రాబోతున్న నాగశౌర్య

లవ్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ అంటూ రకరకాల జానర్స్‌‌‌‌‌‌‌‌లో సినిమాలు చేస్తున్నాడు నాగశౌర్య. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో రాబోతున్నాడు. అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే మూవీ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరూ కలిసి ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. వీళ్లే కాదు.. ఈ మూవీలో మరో కాంబో కూడా రిపీటవుతోంది. ‘కళ్యాణ వైభోగమే’లో కలిసి నటించిన నాగశౌర్య, మాళవికా నాయర్ మరోసారి ఇందులో జోడీగా కనిపించబోతున్నారు.

ప్రస్తుతం లండన్‌‌‌‌‌‌‌‌లో షూటింగ్ జరుగుతోంది. హీరో హీరోయిన్లతో పాటు మెయిన్ యాక్టర్స్ అందరూ పాల్గొంటున్నారు. ఎంతో టాలెంటెడ్ టీమ్‌‌‌‌‌‌‌‌తో ఈ సినిమా తీయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక కూచిభొట్ల.  మరోవైపు త్వరలో ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు నాగశౌర్య. ఇందులో కూడా బ్రాహ్మణ యువకుడిగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్నాడు.