
న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ లుపిన్ యూరప్ కేంద్రంగా పనిచేస్తున్న విసుఫార్మా బీవీ మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. డీల్ విలువ 190 మిలియన్ యూరోలు (సుమారు రూ.1,980 కోట్లు). లుపిన్‌కు చెందిన ననోమి బీవీ ఈ ఒప్పందాన్ని జీహెచ్‌ఓ క్యాపిటల్ పార్టనర్స్‌తో కుదుర్చుకుంది.
విసుఫార్మా 60కి పైగా బ్రాండెడ్ కంటి మందులను అమ్ముతోంది. లుపిన్‌కు యూరప్‌లో వ్యాపార విస్తరణకు, ప్రత్యేక ఫార్మా సెగ్మెంట్‌లో విస్తరించేందుకు తాజా డీల్ సాయపడుతుంది. ఇటలీ, యూకే, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో విసుఫార్మా కార్యకలాపాలు లుపిన్‌కు ప్రత్యక్ష మార్కెట్ ప్రవేశం కల్పిస్తాయి.
ఈ కొనుగోలు ద్వారా లుపిన్ డ్రై ఐ, గ్లుకోమా, బ్లెఫరైటిస్, రెటినల్ హెల్త్, న్యూట్రాస్యూటికల్స్ వంటి విభాగాల్లో మందులను అందించనుంది. ఈ ఏడాది చివరినాటికి ఈ డీల్ పూర్తవుతుందని లుపిన్ తెలిపిం కాగా, గ్లోబల్‌గా ఆఫ్తాల్మాలజీ మార్కెట్ వేగంగా పెరుగుతోంది.