పెరగనున్న మందుల ధరలు ? మెయిన్ రీజన్ ఇదే !

పెరగనున్న మందుల ధరలు ? మెయిన్ రీజన్ ఇదే !

న్యూఢిల్లీ: ఫార్మా రంగంలోని కొన్ని ముఖ్యమైన మందులకు కనీస దిగుమతి ధర (ఎంఐపీ) నిర్ణయించాలన్న కేంద్రం ప్రభుత్వ ప్రతిపాదన అమలైతే ధరలు పెరుగుతాయని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. దీనివల్ల యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీదారుల ఖర్చు పెరిగి, మందుల ధరలు పెరిగే పరిస్థితి వస్తుందని తెలిపారు. ముఖ్యంగా చైనా నుంచి ముడి పదార్థాల దిగుమతిని తగ్గించి, దేశీయ ఉత్పత్తిదారుల మనుగడకు భరోసా కల్పించడానికి ఎంఐపీని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

పెన్సిలిన్-జి, 6 ఏపీఏ, అమాక్సిసిల్లిన్ లాంటి వాటికి ఎంఐపీని నిర్ణయించాలని యోచిస్తోంది. దీనివల్ల ఈ రంగంలోని 10 వేలకు పైగా ఎంఎస్ఎంఈలు మూతపడే అవకాశం ఉందని, రెండు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఎక్స్​పర్టులు అంటున్నారు. అమాక్సిసిలిన్‌‌‌‌ను ఎంఐపీలో చేర్చడం వల్ల ప్రభుత్వ టెండర్ సరఫరా విభాగంలో దేశీయ మందుల ధరలు 40 శాతం పెరుగుతాయని ఒక అధికారి చెప్పారు.