మెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఫార్మా మాన్యుఫాక్చరింగ్ కంపెనీల నుంచి 500 డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సేకరించనున్న కంపెనీ
  • 50-80 శాతం వరకు డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫార్మసీ కంపెనీ మెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లస్  సొంత బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్మాలని చూస్తోంది. పేటెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేని 500 డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  మాన్యుఫాక్చరర్ల నుంచి సేకరించి  తన సొంత లేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తన రిటైల్ స్టోర్లలో అమ్మనుంది. ఈ మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ది కౌంటర్ (ఓటీసీ) డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు, హైపర్ టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డయాబిటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కిడ్నీ చికిత్సలో వాడే డ్రగ్స్ ఉన్నాయి.  ఈ మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 50–80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని  కంపెనీ ఎండీ జీ మధుకర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతానికి ఆరు ఫార్మాస్యూటికల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలతో టై అప్ అయ్యామని, వీటి నుంచి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సోర్సింగ్ చేస్తామని వెల్లడించారు.

మొదట 500 మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై భారీ డిస్కౌంట్స్ ఇస్తామని, రానున్న మూడు నెలల్లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 800 కు పెంచుతామని వెల్లడించారు.  ప్రస్తుతం దేశం మొత్తం మీద 4,000 స్టోర్లను ఆపరేట్ చేస్తున్నామని, 2023–24 లో మరో 800–1,000 స్టోర్లను ఏర్పాటు చేస్తామని మధుకర్ పేర్కొన్నారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.4,558 కోట్ల రెవెన్యూ సాధించామని వివరించారు. కాగా,  మెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లస్ షేరు బుధవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.803 వద్ద క్లోజయ్యింది.