కన్నెపల్లిలో పీహెచ్సీ ప్రారంభం.. ప్రజలకు చేరువలో ప్రభుత్వ వైద్య సేవలు: ఎమ్మెల్యే గడ్డం వినోద్

కన్నెపల్లిలో పీహెచ్సీ ప్రారంభం.. ప్రజలకు చేరువలో ప్రభుత్వ వైద్య సేవలు: ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి రూరల్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​ అన్నారు. కన్నెపల్లి మండలంలో రూ.కోటి 43 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సబ్​ కలెక్టర్ ​మనోజ్​తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు పీహెచ్​సీల ద్వారా మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. 

ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని సదుపాయాలు కల్పింస్తోందన్నారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్​ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో అనిత, డిప్యూటీ డీఎంహెచ్​వో సుధాకర్​నాయక్, ఏసీపీ రవికుమార్,​ డాక్టర్లు అనిల్​ కుమార్, దీప్తి, తహసీల్దార్​ రాంచందర్​రావు, సర్పంచ్​లు జయలక్ష్మి, వెంకుమేర తదితరులు పాల్గొన్నారు. 

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

బెల్లంపల్లి, వెలుగు: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే వినోద్ అన్నారు. బెల్లంపల్లి మండలం పెర్కపల్లిలో రూ.10 లక్షలతో నిర్మించనున్న గ్రామ సమాఖ్య సంఘం భవనం నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామైక్య సంఘాల భవనాల నిర్మాణం ద్వారా మహిళా సంఘాలకు మరింత బలం చేకూరి స్వయం ఉపాధి కార్యక్రమాలు విస్తరిస్తాయన్నారు. 

కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కె.రామచందర్, ఎంపీడీవో మహేందర్,  సర్పంచ్ సాయి, నాయకులు నాతరి స్వామి, సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.