శ్రీలంక కంపెనీలో ఫిలాటెక్స్‭కు వాటా

శ్రీలంక కంపెనీలో ఫిలాటెక్స్‭కు వాటా

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్​కు చెందిన సాక్సుల తయారీ కంపెనీ ఫిలాటెక్స్​ ఫ్యాషన్స్​ లిమిటెడ్​ (ఎఫ్​ఎఫ్​ఎల్​) శ్రీలంకకు చెందిన అప్పారెల్​ కంపెనీ​ ఇసబెల్లా​ లిమిటెడ్​లో 51 శాతం వాటా కొననుంది. ఇందుకోసం రూ.75 కోట్లు ఇన్వెస్ట్​ చేయనుంది. నగరంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ ఎండీ ప్రభాత్​ సేఠియా మాట్లాడుతూ ఈ కంపెనీలో వాటా కొనుగోలు వల్ల ఇంటర్నేషనల్​ మార్కెట్లకూ తమ బిజినెస్​ను విస్తరిస్తామని చెప్పారు. గండిమైసమ్మ ప్రాంతంలోని తమ ప్లాంటులో ఏటా 70 లక్షల సాక్సులను తయారు చేస్తున్నామని చెప్పారు. ఇండియాలో ప్రీమియం క్వాలిటీ సాక్స్​విభాగంలో ఎఫ్​ఎఫ్​ఎల్​ మార్కెట్​ లీడర్​ అని వెల్లడించారు. హైదరాబాద్​ప్లాంటులో మరో 500 మెషీన్లు ఇన్​స్టాల్​ చేసి ప్రొడక్షన్​ను పెంచుతామని వెల్లడించారు. ఇందుకు రూ.350 కోట్లు ఇన్వెస్ట్​ చేస్తామని, 1,700 మందికి జాబ్స్​ దొరుకుతాయని సేఠియా వెల్లడించారు. ప్రస్తుతం తమ యూనిట్లో 300 మంది పనిచేస్తున్నారని వివరించారు.  

‘‘ఇసాబెల్లా గత 25 సంవత్సరాలుగా జర్మనీ, ఫ్రాన్స్, కెనడా,  చెక్ రిపబ్లిక్‌‌‌‌లోని వివిధ క్లయింట్లకు సాక్స్ & టైట్స్ సరఫరా చేస్తోంది. దీనికి 48 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యం ఉంది. దక్షిణ ఆసియాలో సాక్స్ & టైట్స్ తయారీలో రెండో అతిపెద్ద కంపెనీ.  కాటన్, వెదురు, విస్కోస్, యాక్రిలిక్ నూలును వాడి అనేక రకాల సాక్స్‌‌‌‌లను తయారు చేస్తోంది.   మాకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4.5 కోట్ల లాభం వచ్చింది. ఈసారి రూ.పది కోట్లు వస్తుందని భావిస్తున్నాం. ఇసబెల్లా వాటా కొనేందుకు ప్రిఫరెన్షియల్​ షేర్స్​ అలాట్​మెంట్​ ద్వారా నిధులు సేకరిస్తాం. డయాబెటిక్​, చిల్డ్రన్​, పేషెంట్స్​, సెంట్​వంటి సాక్సులనూ మేం తయారు చేస్తాం. రేమండ్​, ఫిలా వంటివి మా కస్టమర్లు. ఇక నుంచి ట్రాక్స్​సూట్స్​, టీషర్టులూ అమ్ముతాం. రాబోయే 30 నెలల్లో రూ.175 కోట్ల లాభం సంపాదించాలని టార్గెట్​గా పెట్టుకున్నాం”అని ఆయన వివరించారు