తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఫోన్​పే

తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఫోన్​పే
  • ఈసాప్స్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ను ప్రకటించిన ఫోన్‌‌‌‌పే
  • స్టాఫ్‌‌‌‌కు రూ.100 కోట్ల షేర్ బైబ్యాక్‌‌‌‌ 
  • మినిమం అలాట్‌‌‌‌మెంట్‌‌‌‌ విలువ రూ.3.5 లక్షలు
  • 2,200 మంది స్టాఫ్‌‌‌‌కు వర్తింపు

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ల కంపెనీ ఫోన్‌‌‌‌పే రూ. 135 కోట్ల విలువైన ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ (ఈసాప్) షేర్ల బైబ్యాక్‌‌‌‌కు రెడీ అయింది. కంపెనీ ఫౌండర్లు బైబ్యాక్‌‌‌‌లో పాల్గొనరు.  మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ మాత్రం తమ వెస్టెడ్‌‌‌‌ స్టాక్‌‌‌‌లలో 10 శాతం వరకు అమ్మొచ్చు.  కంపెనీ ఫౌండర్లు ఈ స్కీముకు దూరంగా ఉంటారు. అన్ని లెవెల్స్ ఎంప్లాయీస్‌‌‌‌కు  ఈసాప్‌‌‌‌ స్కీము వర్తిస్తుంది.  ఫోన్​పేలో 2,200 ఎంప్లాయిస్‌‌‌‌ ఉన్నారు. ఈసాప్ బైబ్యాక్ కింద ప్రతి ఉద్యోగికి కనీస కేటాయింపు రూ. 3.5 లక్షల వరకు ఉంటుంది. 

సస్తాసుందర్​లో ఫ్లిప్​కార్ట్​కు మెజారిటీ వాటా
డిజిటల్ హెల్త్‌‌‌‌కేర్, ఈ– ఫార్మసీ ప్లాట్‌‌‌‌ఫారమ్ సస్తాసుందర్ డాట్‌‌‌‌కామ్‌‌‌‌లో మెజారిటీ వాటాలను వాల్‌‌‌‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌‌‌‌కార్ట్ దక్కించుకుంది.   సస్తా సుందర్‌‌‌‌కు దేశమంతటా 490లకుపైగా ఫార్మసీలతో కూడిన నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఉంది. అయితే ఈ డీల్ సైజును రెండు కంపెనీలూ వెల్లడించలేదు.  ఫ్లిప్‌‌‌‌కార్ట్ హెల్త్ ను ప్రారంభించడం ద్వారా హెల్త్‌‌‌‌కేర్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ఫ్లిప్‌‌‌‌కార్ట్ తెలిపింది.