డాక్టర్లు, మందులు లేకుంటే హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేయండి

డాక్టర్లు, మందులు లేకుంటే హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేయండి
  • వైరల్‌‌‌‌‌‌‌‌ ఫీవర్లపై మంత్రి ఈటల సమీక్ష

రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు విషజ్వరాలతో  ఇబ్బంది పడుతున్నారు. పేషెంట్‌‌‌‌‌‌‌‌లతో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లు కిటకిటలాడుతున్నాయి. విషజ్వరాలు పెరుగుతుండటంతో  వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌ అధికారులతో ‌‌‌‌‌‌‌‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ నుంచి బోధనాసుపత్రి వరకు మందులు పెషెంట్స్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉంచాలన్నారు.  ఈ ఏడాది మొత్తం 3 లక్షల మంది జ్వరాల బారిన పడ్డట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ 3 నెలల్లోనే 90 వేల మంది జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరారు.  పరిస్థితిని సమీక్షించి పెషెంట్స్‌‌‌‌‌‌‌‌కు సహాయం చేసేందుకు ప్రతి జిల్లాకు ర్యాపిడ్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. రోగులకు సహాయం కోసం హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావు తెలిపారు. డాక్టర్లు, మందులు అందుబాటులో లేకున్నా, ఇంకేమైనా ఫిర్యాదులున్నా  9177878599, 040–-2465119 నంబర్లకు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేయాలన్నారు.