రూ.6వేల స్మార్ట్ ఫోన్..ఐఫోన్ ఫీచర్లు దీని ప్రత్యేకత

రూ.6వేల స్మార్ట్ ఫోన్..ఐఫోన్ ఫీచర్లు దీని ప్రత్యేకత

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు భారీ డీల్స్, తగ్గింపులతో అందించబడుతున్నాయి. ఉత్తమ డీల్ కింద కస్టమర్లకు రూ. 7,999 బదులుగా రూ. 6,499 కి టెక్నోపాప్ 8 స్మార్ట్ ఫోన్ ని అందిస్తోంది. ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 6,150 తగ్గింపుతో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తోంది. 

దీనిలో ప్రత్యేకత ఏంటంటే.. డైనమిక్ పోర్ట్ తో వచ్చే 90Hz  డిస్ ప్లే. ఇది సరిగ్గా Apple  డైనమిక్ ఐలాండ్ లాగా కనిపిస్తుంది. ఇందుల్లో క్విక్ నోటిఫికేషన్లను చూడొచ్చు. కేవలం రూ. 7 వేలతో ఐఫోన్ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లను పొందుతారని అనుకోలేదు కదా.. Tecno Pop 8 స్మార్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 

ఈ ఫోన్ 90Hz  రిఫ్రెష్ రేట్ తో 6.56 అంగుళాల HD+(1612x720 పిక్సెల్) డాట్ ఇన్ డిస్ ప్లేతో డైనమిక్ పోర్ట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్ 4GVoLTE, WiFi802.11, బ్లూటూత్ 5.0, GPS, USB టైప్ సి పోర్ట్ లకు మద్దతు నిస్తుంది. 

Tecno Pop8 Unisoc T606 ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ 4GB LPDDR4x RAM, 64 GB UFS2.2 స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ RAM ను 8GB వరకు పెంచుకోవచ్చు.  అదే సమయంలో మెమరీని 1TB వరకు పెంచుకోవచ్చు. ఐఫోన్ తో పోల్చితే 8GB RAM ఉన్న ఐఫోన్ ధర లక్షల్లో ఉంటుంది. ఈ ఫోన్ Android 13 Go ఎడిషన్ ఆధారిత HiOS 13 పై రన్ అవుతుంది. 

బ్యాటరీ, కెమెరా కూడా అద్భుతం 

Tecno Pop8 ఫోన్ వెనక భాగంలో 12 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యుయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ కెమెరాతో పాటు డ్యుయెల్ LED ఫ్లాష్ యూనిట్ కూడా ఉంటుంది.  ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. DTS మద్దతు గల స్టీరియో స్పీకర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. పవర్ విషయానికొస్తే ఈ Tecno ఫోన్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 10 W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో లభిస్తోంది.