హైదరాబాద్ లో గణేష్ శోభయాత్ర ఘనంగా జరుగుతోంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో నగరం మార్మోగిపోతుంది. గణేశ్ నిమజ్జనానికి సిటీ నలుమూలల నుంచి వేల సంఖ్యంలో గణనాథుడి విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు క్యూ కట్టాయి. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేర్చేందుకు భక్తులు బయల్దేరారు. నిమజ్జనం సందర్భంగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పై అడుగు అడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఏయే మార్గాల్లో ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలో తెలియజేస్తూ పోలీసులు రూట్ మ్యాప్ ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. అంతేకాదు నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్యాంక్ బండ్ పై భక్తుల సందడితో కోలాహలంగా మారింది. గంగమ్మ చెంతకు గణనాథుడిని చేర్చేందుకు భారీగా తరలివచ్చారు. డప్పు సప్పులు, నృత్యాలు చేస్తూ భక్త పరవశంలో మునిగిపోయారు. భారీ గణనాథులు ట్యాంక్ బండ్ కు చేరుకోవంతో క్రేన్ల సాయంతో ప్రశాంతంగా నిమజ్జనంచేస్తున్నారు. బై బై గణేశా అంటూ నిమజ్జనం చేస్తూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
ముంబైలో అంగరంగ వైభవంగా లాల్ బాగ్ గణేశుడి ఊరేగింపు
ట్యాంక్ బండ్ కు చేరుకున్న బాలాపూర్ గణేశుడు
హైదరాబాద్ : కాచిగూడ లోని శ్యామ్ బాబా మందిర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అస్సాం సీఎం హేమంత్ బిస్వా... పాల్గొన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు.
కూకట్పల్లి పద్మావతి ప్లాజా వ్యాపార సముదాయం లో వినాయక సంబరాలు
శేరిలింగంపల్లి తార నగర్ మార్కెట్లో గణపతి ఊరేగింపు....
కాచిగూడ లో ఝాన్సీ లక్ష్మీ భాయ్ , భగత్ సింగ్ , అల్లూరి సీతారామరాజు వేషధారణలతో
హైదరాబాద్ : కాచిగూడ లో......
